టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచిక ఆవిష్కరణ

December 18
10:10 2017

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఏర్పడి నేటికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచికను రూపొందించారు. వెబ్ సంచికను తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు.ఈ సందర్బంగా కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసింది. మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎస్‌పీఎస్సీ దేశానికే ఆదర్శంగా నిలిపామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పడి నేటికి మూడేళ్లు అవుతున్న సందర్భంగా.. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచికను ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇవాళ ఆరోగ్యశాఖకు సంబంధించి రెండు నోటిఫికేషన్లను విడుదల చేశామన్నారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కంప్యూటరైజేషన్ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే గురుకులాలకు సంబంధించిన, ఇతర నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాలు ఫలితాలను వారం, పదిరోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. 2018సంవత్సరంలో మరికొన్ని నోటిఫికేషన్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'