పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

February 03
20:49 2017

 విజన్ వాలెంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు సి.రజిత పిలుపు

పోలియో రహిత మాజాన్నినిర్మిద్దామని,పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ విజన్ వాలెంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు సి.రజిత పిలుపు నిచ్చారు.పల్స్ పోలియో కార్యక్రమం పురస్కరించుకొని సంస్థ ఆద్వర్యంలో గత మూడు రోజులుగా నగరం లోని లింగోటి గూడా,సరూర్ నగర్ ,ప్రాంతాలల్లో సంస్థ  నాయకులు,కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సుమారు 500 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసి నట్లు రజిత తెలిపారు.సరూర్ నగర్ కమిటి హాల్ లో రజిత నేతృత్వంలో క్యాంప్ ను నిర్వహించి పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసినట్లు ఆమె చెప్పారు. ఈ సందర్బంగా రజిత మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో మంచిదని స్వచ్చంద సంస్థ భాద్యతగా మేము ముందుకు వచ్చి తమ వంతు చేయుత నిచ్చామన్నారు.గతంలో పోలియో వల్ల అవిటి వారై సమాజానికి దూరంగా ఉంటూ మానసికంగా ఎంతో ఆవేదన చెందేవారని అన్నారు.కానీ పోలియో చుక్కలు వచ్చిన తర్వాతా పోలియో బారిన పడేవారి  సంఖ్య క్రమక్రమంగా తద్దిన్దన్నారు.నేడు దేశం పోలియో రహిత దేశంగా విరాజిల్లడం ఎంతో శుభాపరినామమన్నారు.ఐనప్పటికీ పిల్లల జననం జరుగుతున్దున ప్రతి ఏట  పోలియో  చుక్కలు తప్పని సరి అన్నారు.ఈ సందర్బంగా పలు ప్రాంతాల్లో పచ్చదనం-పరిశుబ్రత కార్యక్రంలో బాగంగా మొక్కలను నాటినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలతో పాటు విజన్ వాలెంటరీ ఆర్గనైజేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'