హెరిటేజ్ క‌ట్ట‌డాల పున‌రుద్ద‌ర‌ణ‌కు రూ. 6.77కోట్లు కేటాయింపు

April 18
21:03 2017

రూ. 1.77 కోట్ల‌తో చార్‌క‌మాన్ పున‌రుద్ద‌ర‌ణ‌
రూ. 5కోట్ల‌తో మ‌హ‌బూబ్‌చౌక్ ప‌న‌ర్‌నిర్మాణం

న‌గ‌రంలోని ప‌లు చారిత్ర‌క ప్రాధాన్యం క‌లిగిన పురాత‌న క‌ట్ట‌డాల‌ను పున‌రుద్ద‌రణ‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్ర‌క‌టించ‌డంతో వాటి అభివృద్దికి జీహెచ్ఎంసీ నిధుల‌ను మంజూరు చేసింది. ఇందుకుగాను హైద‌రాబాద్‌లోని ప‌లు వార‌స‌త్వ క‌ట్ట‌డాల పున‌రుద్ద‌ర‌ణ‌కు జీహెచ్ఎంసీ ప్ర‌త్యేకంగా రూ. 6.77కోట్ల‌ నిధుల‌ను మంజూరు చేసింది. ఓల్డ్ సిటీలోని ముర్గి చౌక్ ఆధునీక‌ర‌ణ‌కు రూ. 3.5కోట్లు, చార్మినార్ స‌మీపంలోని క్లాక్‌ట‌వ‌ర్ పున‌రుద్ద‌ర‌ణ‌కు కోటిన్న‌ర, చార్ క‌మాన్‌ల ఆధునీక‌ర‌ణ‌కు కోటి 77ల‌క్ష‌ల రూపాయ‌లు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుతో దాదాపు 400 ఏళ్ల‌కు పైగా ఉన్న చార్ క‌మాన్‌ల పున‌రుద్ద‌ర‌ణ‌, 120ఏళ్ల‌కు పైగా ఉన్న మ‌హ‌బూబ్ చౌక్ మార్కెట్‌, క్లాక్‌ట‌వ‌ర్‌ల పున‌రుద్ద‌ర‌ణ‌తో ఓల్డ్ సిటీని సంద‌ర్శించే ప‌ర్యాట‌కుల‌కు ఈ నిర్మాణాలు స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నాయి.
కుత్బుషాహిల ఆధ్వ‌ర్యంలో 1592లో చార్మినార్ చుట్టూ నాలుగు క‌మాన్‌ల‌ను నిర్మించారు. ప్ర‌తి క‌మాన్‌కు ఓ ప్ర‌త్యేక పేరు క‌లిగి ఉన్నాయి. మ‌దీనా కేఫ్ వైపు ఉన్న‌ మ‌చిలి క‌మాన్‌, తూర్పు వైపు ఉన్న కాలీ క‌మాన్‌, ప‌శ్చిమ వైపు ఉన్న క‌మాన్ ఏ ష‌హ‌ర్‌, మిట్టి కా షేర్ క‌మాన్‌లు ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం ఈ క‌మాన్‌లు చిరు వ్యాపార‌స్తుల ఆక్ర‌మ‌ణ‌లో ఉన్నాయి. ఈ నాలుగు క‌మాన్‌ల‌పై మొక్క‌లు మొల‌వ‌డం, ట్రాఫిక్ వ‌ల్ల వ‌చ్చే ధ్వ‌ని, వాయు కాలుష్యంతో క‌మాన్‌లు శోభ‌ను కోల్పోయాయి. చారిత్ర‌క వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తించిన ఈ చార్ క‌మాన్ల‌ను పున‌రుద్ద‌రించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాల మేర‌కు వీటి పున‌రుద్ద‌ర‌ణ‌కు కోటి 70ల‌క్ష‌ల రూపాయ‌లను జీహెచ్ఎంసీ విడుద‌ల చేసింది.
హైద‌రాబాద్ స్టేట్ ప్ర‌ధాన మంత్రిగా 1887 నుండి 1894 వ‌ర‌కు ప్ర‌ధాన మంత్రిగా ఉన్న పైగా వంశ‌స్తుడైన న‌వాబ్ అస్మాన్ ద బ‌హ‌దూర్ చార్మిన‌రార్ స‌మీపంలోని మ‌హ‌బూబ్ చౌక్‌ను చ‌తుర‌స్రం ఆకారంలో నిర్మించారు. ఈ చౌక్ మ‌ధ్య‌లో ఐదు అంత‌స్తుల క్లాక్ ట‌వ‌ర్‌ను కూడా నిర్మించారు. ముర్గి చౌక్‌గా పిలుస్తున్న ఈ మ‌హ‌బూబ్‌చౌక్‌లో స్థానికులు వ్యపారం నిర్వ‌హించ‌డం, పాత హోమియో ప‌తి ఆసుప‌త్రి, మ‌జీద్ ఉంది. ఇందులో ఉన్న క్లాక్‌ట‌వ‌ర్ ప్ర‌హారీగోడ‌ను, ఫుట్‌పాత్‌ను పూర్తిగా ఆక్ర‌మించి హార్డ్‌వేర్ షాప్‌లు నిర్వ‌హిస్తున్నారు. పాత పుస్త‌కాల విక్ర‌య దుకాణాలతో పాటు దేశంలోనే అతి పురాత‌న ప‌క్షుల విక్ర‌య కేంద్రాలు ఈ మార్కెట్‌లో ఉన్నా యి. ప్ర‌స్తుతం ఈ మార్కెట్‌లో ఉన్న దుకాణాల పైక‌ప్పులు, గోడ‌లు కూలిపోయి పూర్వ వైభ‌వాన్ని కోల్పోయింది. ఒక ఎక‌రం విస్తీర్ణంలో 262 దుకాణాల‌కు ఉన్న ఈ మార్కెట్‌ను ప్ర‌స్తుతం ఉన్న మాదిరిగానే పున‌ర్ నిర్మించడానికి రూ. 5కోట్ల‌ను జీహెచ్ఎంసీ కేటాయించింది. ఈ మార్కెట్ అండ‌ర్‌గ్రౌండ్ సెల్లార్‌, గ్రౌండ్‌, ఫ‌స్ట్‌ఫ్లోర్‌ల‌ను నిర్మించ‌నున్నారు. ఈ మార్కెట్‌లోని క్లాక్‌ట‌వ‌ర్ పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌ను కోటిన్న‌ర రూపాయ‌ల‌ను జీహెచ్ఎంసీ మంజూరు చేసింది.

Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'